Apr 21, 2022, 5:19 PM IST
కాపు, కమ్మ, రెడ్డి, వెలమ కులాలకు చెందిన వారు ఒక మెట్టు దిగి బహుజనులతో నడిచివస్తే బ్రాహ్మణ ఆధిపత్యానికి గండి కొట్టడం సాధ్యమవుతుందని, ఈ అగ్రకుల శూద్రుల 'మైండ్ సెట్' మారాల్సిన అవసరం ఉంది అని ఒక కొత్త ఆలోచనను ప్రతిపాదిస్తున్నారు కవి, రచయిత, విమర్శకులు హెచ్చార్కె. ఇంకా రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కలవాలని కోరుకుంటున్న వారిలో తాను ముందుంటానని అంటున్న హెచ్చార్కె విప్లవోద్యమాలు వాటి జయాపజయాలు, పనితీరుపై ఏషియానెట్ న్యూస్ ప్రతినిధి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ తో ముచ్చటించారు. వివిధ అంశాలపై ఆయన స్పందనలు ఏమిటో చూడండి.