ఆకాశమే హద్దుగా పసిడి ధరలు : కొనబోతే కొరవే....

Jul 2, 2020, 4:54 PM IST

భారతీయ సంస్కృతిలో, సంప్రదాయంలో.. ఆహారంలో, ఆహార్యంలో బంగారం ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పిసరంత బంగారమైన లేనిదే ఏ వేడుకా జరుపుకోరంటే ఆశ్చర్యంలేదు. పేదా, గొప్పా తేడా లేకుండా ఎవరి స్థాయిలో వారు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు బంగారానికి రెక్కలు వచ్చాయి.. సామాన్యుడికి అందకుండా ఆకాశంలోకి ఎగిరిపోతోంది.