జియో న్యూ ఇయర్ ఆఫర్: 2025 సంవత్సరానికి ధమాకా ఆఫర్!

Published : Dec 11, 2024, 11:50 PM ISTUpdated : Dec 11, 2024, 11:52 PM IST

Reliance Jio 2025 New Year Welcome Plan Offers : 2025 నూతన సంవత్సరానికి జియో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ అనే ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, అపరిమిత 5G డేటా లభిస్తుంది.

PREV
15
జియో న్యూ ఇయర్ ఆఫర్: 2025 సంవత్సరానికి ధమాకా ఆఫర్!

జియో 2025 ప్లాన్ బెనిఫిట్స్

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన రిలయన్స్ జియో.. వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొత్త రిఛార్జ్ ప్లాన్లన తీసుకువస్తూనే ఉంది. ఇదే క్రమంలో రాబోయే కొత్త సంవత్సరం కోసం మరో సూపర్ రిచార్జ్ ప్లాన్ ను తీసుకువచ్చింది. ఈ ప్లాన్ లో మీరు అపరిమిత కాలింగ్, అపరిమిత 5జీ ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకోవచ్చు. అదే జియో కొత్త ₹2025 ప్లాన్.. ఇప్పుడు న్యూఇయర్ ఆఫర్ కింద ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంది.

25

జియో 2025 ప్లాన్ వ్యాలిడిటీ

జియో కొత్త సంవత్సరం రీఛార్జ్ ప్లాన్ సూపర్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు రీఛార్జ్ చేసుకున్న దాదాపు మొత్తం డబ్బులు మీకు తిరిగి వస్తాయి. ఎలాగంటే ఈ రీచార్జ్ తో మీకు జియో పార్టనర్ వెబ్‌సైట్లలో ₹2,150 విలువైన వోచర్లు, కూపన్లు ఉచితంగా లభిస్తాయని జియో తెలిపింది. జియో న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ ₹2025కి లభిస్తుంది. ఇది 200 రోజుల వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్. కస్టమర్లు అపరిమిత 5G ఇంటర్నెట్, ఉచిత కాల్స్ పొందుతారు.

35

జియో న్యూ ఇయర్ ప్లాన్ కూపన్లు

5జీ నెట్ వ‌ర్క్ వ‌చ్చే ప్రాంతాల్లో మీరు అప‌రిమిత డేటాను ఉప‌యోగించుకోవ‌చ్చు. అలాగే, కాలింగ్ కూడా అప‌రిమితంగా ఉంటుంది. కానీ 4G డేటా విషయానికి వస్తే రోజుకు 2.5 GB మాత్రమే అందుబాటులో ఉంది. అంటే 200 రోజుల్లో మొత్తం 500 GB అందుబాటులో ఉంటుంది. రోజుకు 2.5 GB డేటాతో రీఛార్జ్ ప్లాన్ ఈ ఆఫర్‌ను పొందవచ్చు. దీనితో పాటు మీరు వ్యాలిడిటీ స‌మ‌యంలో రోజుకు 100 SMSలను ఉచితంగా పంపవచ్చు.

45

జియో 2025 ప్లాన్ ఆఖరి తేదీ

ఈ ప్లాన్ జనవరి 11, 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కాలంలో 2025 నాటికి రీఛార్జ్ చేసుకుంటే కస్టమర్లు రూ.468 కూడా ఆదా చేసుకోవచ్చని రిలయన్స్ జియో పేర్కొంది. అలాగే, Ajio సైట్‌లో కనీసం రూ.2,500 కొనుగోలుపై రూ.500 కూపన్‌ను ల‌భిస్తుంది. Swiggyలో కనిష్టంగా రూ. 499 ఆర్డర్ చేస్తే రూ. 150 తగ్గింపు వోచర్ లభిస్తుంది. అలాగే, Easemytrip.com మొబైల్ యాప్,  వెబ్‌సైట్‌లో విమాన బుకింగ్‌ల కోసం రూ.1,500 తగ్గింపు కూపన్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ కూపన్‌లను MyJio మొబైల్ అప్లికేషన్ ద్వారా రీడీమ్ చేసుకోవచ్చు.

55

జియో న్యూ ఇయర్ ప్లాన్

రిలయన్స్ జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు టారిఫ్‌లను పెంచిన తర్వాత ఇది ముఖ్యమైన ఆఫర్ అని చెప్పాలి. జూలై 2024లో జియో ప్రీపెయిడ్-పోస్ట్‌పెయిడ్ టారిఫ్‌లు 60 శాతం వరకు పెంచింది. టారిఫ్‌ల పెంపు అమల్లోకి వచ్చిన తరుణంలో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా 5జీ సేవలు ఉచితంగా లభిస్తాయని ప్రకటించింది. జియో ప్రకటన తర్వాత, టెల్కోలు ఎయిర్‌టెల్, వి (వోడాఫోన్ ఐడియా) కూడా తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి.

click me!

Recommended Stories