Oct 16, 2019, 4:19 PM IST
కరీంనగర్: మంథని ఆర్టీసీ బస్సు డిపోను జిల్లా కలెక్టర్ దేవసేన ఆకస్మికంగా సందర్శించారు. కార్మికుల సమ్మె సందర్బంగా బస్సులు ఏ విధంగా నడుస్తున్నాయి... ప్రయాణికుల సమస్యల గురించి తెలుసుకునేందుకు కలెక్టర్ ప్రయత్నించారు. అయితే ఓవైపు సమ్మె నడుస్తున్నా మరోవైపు 98% బస్సులు రోడ్లపైకి వచ్చాయని ఆమె వెల్లడించారు. ప్రయాణికుల వద్ద తాత్కాలిక సిబ్బంది ఎక్కువ చార్జీలు తీసుకోకుండా టింగ్ మిషన్ల వినియోగంపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. స్కూల్ ప్రారంభం అవుతున్న క్రమంలో విద్యార్థులకు బస్సు పాస్ లు ఇవ్వాలని...అందుకోసం అధికారులు పర్యవేక్షణకు ఆదేశించారు.