Apr 2, 2021, 12:02 PM IST
నాగార్జున, దియా మీర్జా, సయామీ ఖేర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న `వైల్డ్ డాగ్` చిత్రానికి అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించారు. ఆయనకిది తొలి చిత్రం. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించి హిమాలయాల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం విశేషం. మరోవైపు ఎలాంటి పాటలు లేకుండా రూపొందిన చిత్రమిది. పూర్తి కథమీదే సాగుతుంది. మరి ఏమేరకు అలరిస్తుందో తెలుసుకుందాం. చాలా రోజుల తర్వాత నాగార్జున సినిమా ప్రీమియర్ షోస్ వేయడం, ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్ వేయడం విశేషం.