ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన సినీ తారలు వీరే

ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన సినీ తారలు వీరే

Published : Jan 01, 2025, 10:04 PM IST

2024 Tollywood Marriages: ఈ ఏడాది చాలామంది సినిమా సెలబ్రిటీలు పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు.

2024 Tollywood Marriages: ఈ ఏడాది చాలామంది సినిమా సెలబ్రిటీలు పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు. 2024 లో సినిమా పెళ్లిల్ళు చాలా జరిగాయి. అందులో ఇండస్ట్రీలో ఉంటూ ప్రేమించి పెళ్ళాడిన జంటలు కూడా చాలామంది ఉన్నారు.  మరీ ముఖ్యంగా టాలవుడ్ నుంచి చాలామంది సినిమా సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారయ్యారు. మరి ఈ ఏడాది పెళ్లి చేసుకున్న వెండితెర బుల్లితెర నటులు ఎవరంటే..? 

Naga Chaitanya – Sobhita సమంతకు విడాకులు ఇచ్చిన తరువాత అక్కినేని యంగ్  హీరో నాగచైతన్య  హీరోయిన్ శోభిత ధూళిపాళ తో ప్రేమలో పడ్డాడు.  కొన్నేళ్లుగా ప్రేమించుకున్న వీరు రీసెంట్ గా  డిసెంబర్ 4న ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇక 15ఏళ్ళుగా తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమలో ఉంది హీరోయిన్ కీర్తి సురేష్. కాని ఒక్క సారి కూడా ఈ విషయం బయటకు తెలియకుండా చాలాసీక్రేట్ ను మెయింటేన్ చేసింది. ఇక రీసెంట్ గా తన పెళ్ళి ప్రకటన చేసిన ఆమె.. డిసెంబర్ 12న తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని ప్రేమ వివాహం చేసుకుంది.టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన హీరోయిన్న్ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గడంతో ప్రస్తుతం బాలీవుడ్ కి చెక్కేసిన ఈ బ్యూటీ..  బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో చాలా కాలంగా  ప్రేమాయణం నడిపి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంది.ఇక హీరో సిద్దార్థ్ – హీరోయిన్ అదితిరావు హైదరి వీళ్ళిద్దరు విడిగా పెళ్ళిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నవారే. ఈక్రమంలో వీరు సముద్రం సినిమా టైమ్ లో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళు ప్రేమింకుకున్నాక... రీసెంట్ గా  సెప్టెంబర్ లో  వరంగల్ దగ్గర్లోని ఓ ఆలయంలో సింపుల్ గా పెళ్ళి చేసుకున్నారు. యంగ్ హీరో  కిరణ్ అబ్బవరం పెళ్ళి కూడా ఈ ఏడాదే అయ్యింది. ఎంతో కష్టపడి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన కిరణ్.. హీరోగా  నిలబడ్డాడు. ఇక ఈ జర్నీలో తనకు నచ్చిన  హీరోయిన్ రహస్య గోరఖ్ తో ప్రేమలో పడ్డాడు కిరణ్.  గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న వీరు ఈ ఏడాది ఆగస్టులో  పెళ్ళి  చేసుకున్నారు.ఇక స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోలను మించిన ఇమేజ్ సాధించాడు  సుబ్బరాజు. ఏజ్ పెరిగినా... ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించే సుబ్బరాజు.. అసలు పెళ్ళే వద్దంటూ.. తన  47 ఏళ్ళ వయసులో ఇంటివాడు అయ్యాడు. ఈమధ్యే  నవంబర్ లో స్రవంతి అనే  లేడీ డాక్టర్ ను  అమెరికాలో  వివాహం చేసుకున్నాడు.ఇక సౌత్ ఇండియన్ లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్ళి కూడా ఈ ఏడాదే అయ్యింది.  ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాల‌రీ నిర్వాహ‌కుడు నికోలాయ్ సచ్‌దేవ్ ను ప్రేమించిన వరలక్ష్మి.. పెద్దలను ఒప్పించి  జులైలో పెళ్లి చేసుకుంది. ఇక  హీరోయిన్ మేఘ ఆకాష్ పెళ్ళి కూడా ఈ ఏడాదే అయ్యింది.  తమిళనాడులోని ఓ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన విష్ణు అనే వ్యక్తిని  సెప్టెంబర్ లో పెళ్ళాడింది హీరోయిన్. టాలీవుడ్ స్టార్ సీనియర్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో పెళ్ళి చేసుకున్నారు. ఫస్ట్ వైఫ్ కు విడాకులు ఇచ్చిన ఆయన  నవంబర్ లో డాక్టర్ ప్రీతీ చల్లాను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది మరో దర్శకుడు కూడా పెళ్ళి చేసుకున్నాడు. సుహాస్ హీరోగా  కలర్ ఫోటో  సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు  సందీప్ రాజ్ నటి చాందిని రావును ప్రేమించాడు. చాలా కాలం ప్రేమించుకున్న వీరు రీసెంట్ గా తిరుమలలో పెళ్లి చేసుకున్నారు.ఒకప్పుడు హీరోగా టాలీవుడ్ లో మంచి పేరుతెచ్చుకన్న నటుడు సాయి కిరణ్. ప్రస్తుతం సీరియల్స్ తో బిజీగా ఉన్నాడు. గుప్పెడంత మనసు సీరియల్ లో మహేంద్రగా అందరికి చేరువైన కిరణ్ రీసెంట్ గా రెండో పెళ్ళి చేసుకున్నారు.  స్రవంతిలో అనే మరో సీరియల్ ఆర్టిస్ట్ ని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఇక మరో సీరియల్ జంట కూడా రీసెంట్ గా పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు.  బిగ్ బాస్ తో పాపులారిటీ తెచ్చుకున్న సీరియల్ నటి ప్రియాంక జైన్ కూడా తన ప్రియుడు, సీరియల్ నటుడు శివకుమార్ తో చాలా కాలంగా సహజీవనం చేస్తూ వచ్చింది. ఇక ఈ ఏడాది  ఏప్రిల్ లో వీరు పెళ్ళి చేసుకున్నారు. ఇలా చాలామంది సినిమా జంటలు ఈ ఏడాది పెళ్ళి బంధంతో ఒక్కటయ్యారు.

మనల్నెవడ్రా ఆపేది.. పవన్ డైలాగుతో దుమ్ము రేపిన నాని | HIT3 | Srinidhi Shetty | Asianet News Telugu
పాక్ కి ఇండియా గట్టిగా ఇచ్చిపడేస్తుంది: పహల్గాం ఘటనపై విశ్వక్సేన్ | Nani | Hit3 | Asianet Telugu
Hit3 చివరి 30 నిమిషాలు మామూలుగా ఉండదు.. నాని ముందే లీకిచ్చిన అడవి శేషు | Asianet News Telugu
షూటింగ్ లో నాని జుట్టు కాలిపోయింది.. అయినా తగ్గలేదు: శైలేష్‌ కొలను | Hit3 | Nani | Asianet Telugu
HIT3 రివ్యూ ముందే చెప్పిన రాజమౌళి | Nani | SS Rajamouli | Srinidhi Shetty | Asianet News Telugu
మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్.. ఓపెన్ అయిన రాజమౌళి | Hit3 | Nani | Rajamouli | Asianet Telugu
వామ్మో.. KGF హీరోయిన్ ఇంత ఇంటెలిజెంటా! 10thలో 93 పర్సెంట్ | Srinidhi Shetty | HIT3 | Asianet Telugu
Retro: పహల్గాం ఘటనపై విజయ్ దేవరకొండ రియాక్షన్ | Suriya | Pahalgam Attack | Asianet News Telugu
బ్రిటిషోళ్లని, ఔరంగజేబుని కలిసి నాలుగు పీకాలని ఉంది: Vijay Devarakonda, Surya fun | Asianet Telugu
Retro: మేమంతా మీతో ఉన్నాం.. పహల్గాం ఘటనపై సూర్య హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ | Pahalgam | Asianet Telugu