Sep 26, 2019, 5:36 PM IST
ఫిల్మ్ చాంబర్ లో ఉంచిన నటుడు వేణుమాధవ్ భౌతిక కాయానికి సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు. అన్నగారు స్వర్గీయ ఎన్టీఆర్ ను కూడా తన మిమిక్రీతో ఇమిటేట్ చేసిన ఘనత వేణు మాధవ్ దని కొనియాడారు. షూటింగ్ లో వేణుమాధవ్ ఉంటే సందడే సందడి అని చెప్పారు. స్వయంకృషి, పట్టుదలతో అతితక్కువ కాలంలో అనేక చిత్రాల్లో నటించాడని అన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢసానుభూతి తెలిపారు.
జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉండడం నటుల అదృష్టమని అన్నారు. చాలా రోజులుగా హాస్పిటల్ లో ఉన్న వేణుమాధవ్ చికిత్సకు చాలా ఖర్చయ్యిందని..చివరిరోజు రెండులక్షల హాస్పిటల్ బిల్లును తలసాని కట్టేశారంటూ తలసానికి కృతజ్ఞతలు తెలిపారు జీవిత.