Galam Venkata Rao | Published: Mar 31, 2025, 8:00 PM IST
రామ్ గోదాల దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం "ఓ భామా అయ్యో రామా". సుహాస్, మాళవిక మనోజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించగా.. అనితా హస్సానందని, అలీ, రవీందర్ విజయ్, బబ్లూ పృథివీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మోయిన్, సాత్విక్ ఆనంద్, నాయని పావని తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రధన్ సంగీతం సమకూర్చగా, ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీని అందించగా, భవిన్ ఎమ్ షా ఎడిటింగ్ చేశారు. వి ఆర్ట్స్ బ్యానర్‌పై హరీష్ నల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో థియేటర్లలో విడుదల అవుతున్న సందర్భంగా మూవీ టీం సరదాగా సాగే ఇంటర్వ్యూ విడుదల చేసింది. చూసేయండి .