vuukle one pixel image

Singer Kalpana: కల్పన ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ట్విస్ట్ ఇచ్చిన కూతురు | Daya Prasad Prakar

Galam Venkata Rao  | Published: Mar 5, 2025, 6:01 PM IST

ప్రముఖ టాలీవుడ్‌ సింగర్‌ కల్పన ఆ*త్మహత్యా యత్నం చేసినట్లు అంతటా ప్రచారం జరిగింది. మార్చి 4న ఆమె ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఆమెకి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో కల్పన సూ*సైడ్‌ అటెంప్ట్ చేసిందని అందరూ భావించారు. నిద్రమాత్రలు తీసుకుని ఆమె ఆ*త్మహ*త్యా యత్నం చేసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చెన్నైలో ఉన్న ఆమె భర్త ప్రసాద్‌ని కూడా పిలిపించి విచారించారు. ఇదిలా ఉంటే తాజాగా దీనిపై సింగర్‌ కల్పన కూతురు దయ ప్రసాద్‌ ప్రకర్‌ స్పందించింది. అసలు జరిగింది ఏంటో వెల్లడించింది.