Galam Venkata Rao | Published: Mar 28, 2025, 7:00 PM IST
డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ స్వీయ రచన, దర్శకత్వంలో రూపొందిన తెలుగు యూత్ ఫన్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్ స్క్వేర్ (MAD Square). నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్‌గా నిలిచిన మ్యాడ్ కి సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్.. కాగా, మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా మూవీ టీం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మాట్లాడారు. సినిమా ఇంత సక్సెస్ అవుతుందని ఊహించలేదన్నారు.