Jul 15, 2020, 6:56 PM IST
సంచలన నటి షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లేడీస్ నాట్ అలౌడ్’. కె.ఆర్. ప్రొడక్షన్ పతాకంపై రమేష్ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్ రెడ్డి సహ నిర్మాత. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ ఇబ్బందుల గురించి చెప్పారామె. సినిమా తీసి రెండేళ్లవుతున్నా ఇంకా రిలీజ్ కు నోచుకోలేదని వాపోయారు. ఇప్పుడు దాన్ని డిజిటల్ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ చేయాలనుకుంటున్నామని తెలిపారు.