Mar 16, 2021, 2:56 PM IST
వివాదరహితుడిగా పేరున్న దర్శకుడు శేఖర్ కమ్ముల ను సారంగదరియా సాంగ్ వివాదం వెంటాడుతుంది. ఆ పాట నాదేనంటూ రచ్చకెక్కిన సింగర్ కోమలి వివాదానికి తెరదించేలా శేఖర్ కమ్ముల ఓ లేఖ విడుదల చేసి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే మోసం చేశారంటూ కోమలి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.