సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `మజాకా`. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి బెజవాడ ప్రసన్న కుమార్ రైటర్. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్, హాస్య మూవీ, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మించారు. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ నెల 26న సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌లో మూవీ టీం తమ అనుభవాలను పంచుకుంది.