జీవితంలోకి వచ్చి ఏడిపించేసి వెళ్ళిపోతారు ... రేణు దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ ఎవరికోసం..?

Apr 4, 2023, 1:34 PM IST

నటి రేణు దేశాయ్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతోంది. ఆమె ఎవరినో ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్స్ చర్చకు దారి తీస్తుంటాయి. పరోక్షంగా ఎవరినో ఉద్దేశించి అంటున్నట్లు ఆమె కామెంట్స్ ఉంటాయి. రేణు దేశాయ్ తాజా పోస్ట్ మరోసారి నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించింది. తనను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళను తలచుకుని రేణు దేశాయ్ బాధపడుతున్నట్లుగా ఆ సందేశం ఉంది.