Jul 18, 2020, 2:52 PM IST
డ్రంక్ అండ్ డ్రైవ్ మీద క్రైం బ్యాక్ గ్రౌండ్ లో నిర్మించిన సినిమా ‘రా’.. ఈ సినిమా పోస్టర్ ను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ రిలీజ్ చేశారు. రమణా లోడెత్తాల్రా ఫేం కొమరం ముఖ్యపాత్రలో అందరూ కొత్తవాళ్లతో నిర్మిస్తున్న సినిమా ‘రా’. రాజు డొకరా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో చంటి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుందని చెబుతున్నారు.