Galam Venkata Rao | Published: Mar 27, 2025, 6:00 PM IST
ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై చేసిన వ్యాఖ్యల విషయంలో స్పందించారు ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్. అందరు అనుకున్నట్టు వేరే ఉద్దేశ్యం తనకు లేదని ఆయన అన్నారు. అంతే కాదు తాను వార్నర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యామన్నారు. ఆ చనువుతో కాస్త అటు ఇటుగా మాట్లాడాను తప్పించి.. తనకు వేరే ఆలోచన లేదున్నారు. కావాలని తనను అవమానించలేదని క్లారిటీ ఇస్తూ.. రాజేంద్ర ప్రసాద్ ఓ వీడియో రిలీజ్ చేశారు.