సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడారు. డాకు మహారాజ్ సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడికెళ్లినా తమన్ ఆర్ఆర్ గురించే మాట్లాడుతున్నారని చెప్పారు.