May 29, 2020, 12:54 PM IST
మొదటి సినిమా ‘అ’తోనే అందరినీ ఆకర్షించి, జాతీయ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. కల్కితో రాజశేఖర్ కు చాలా ఏళ్ల తరువాత సక్సెస్ రుచి చూపించాడు. ఇక విషయానికి వస్తే కరోనా నేపధ్యంలో ప్రశాంత్ వర్మ కరోనా వ్యాక్సిన్ అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు.