Sep 9, 2019, 6:29 PM IST
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో రిలీజ్ కి ముందు భారీ స్థాయిలో ప్రమోషన్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడు అభిమానులతో కలిసి ఒకసారి సినిమా చూస్తానని చెప్పిన ప్రభాస్ ఫైనల్ గా సినిమా చూసేందుకు మహేష్ AMB మల్టిప్లెక్స్ కి వచ్చాడు. దీంతో అభిమానులు ప్రభాస్ తో ఫోటో దిగేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. వీలైనంత వరకు ప్రభాస్ అభిమానులకు సెల్ఫీలు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు.