May 3, 2022, 10:23 AM IST
హైదరాబాద్: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లీం సోదరీ సోదరులకు ప్రముఖ హీరో, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ముస్లీం స్టైల్లో టోపీ ధరించి ఓ వీడియో సందేశాన్ని రూపొందించి విడుదల చేసారు బాలయ్య. ''మతగురువు మహ్మద్ ప్రవక్త చూపిన మార్గాన్ని అనుసరించిన ముప్పైరోజులు కఠోర ఉపవాస దీక్ష పూర్తిచేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలాం. ఓవైపు ఆద్యాత్మికత మరోవైపు సర్వమానవ సమానత్వం, సేవాబావం చాటిచెప్పేదే రంజాన్. ఈ రంజాన్ పర్వదిన మనందరి జీవితాల్లో కొత్తవెలుగులు నింపాలని, అందరూ సుఖసంతోషాలతో వుండాలని, మంచి భవిష్యత్ ప్రసాదించాలని కోరుకుంటున్నాను'' అని బాలకృష్ణ పేర్కొన్నారు.