Published : Dec 12, 2024, 07:16 AM IST

Bigg Boss Telugu 8 live Updates|Day 102: సూట్ కేసు ఆఫర్ కోసం అవినాష్ వెయిటింగ్ 

సారాంశం

టైటిల్ కొడతానని ఏ మాత్రం నమ్మకం లేని అవినాష్ సిద్ధంగా ఉన్నాడట. రూ. 10-15లక్షల ఆఫర్ వస్తే అవినాష్ తీసుకుని, టైటిల్ రేసు నుంచి తప్పుకుంటాడని అంటున్నారు.

 Bigg Boss Telugu 8 live Updates|Day 102: సూట్ కేసు ఆఫర్ కోసం అవినాష్ వెయిటింగ్ 

07:17 PM (IST) Dec 12

గౌతమ్ కోసం గట్టిగా డ్యూటీ చేస్తున్నారు

నిఖిల్ వర్సెస్ గౌతం అన్నట్లు బిగ్ బాస్ తెలుగు 8 ఉంది. వీరిద్దరి మధ్యే టైటిల్ పోరు నడుస్తుంది. కాగా సోషల్ మీడియాలో గౌతమ్ కి గట్టి ప్రచారం దక్కుతుంది. ఆయన కోసం పీఆర్ టీమ్ లు పెద్ద ఎత్తున డ్యూటీ చేస్తున్నాయి. మరి చూడాలి వారి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో... 

06:50 PM (IST) Dec 12

తన జర్నీ చూసి అవినాష్ ఎమోషనల్

11వ వారమే ఎలిమినేట్ కావాల్సిన అవినాష్ అనూహ్యంగా ఫైనల్ కి చేరాడు. తన బిగ్ బాస్ హౌస్ జర్నీ ప్రదర్శించగా, ఎమోషనల్ అయ్యాడు. మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలే కాగా టాప్ 5 కంటెస్టెంట్స్ ఏవీ లను ప్రదర్శిస్తున్నారు. 

03:01 PM (IST) Dec 12

గౌతమ్ బ్యూటిఫుల్ జర్నీ!


కంటెస్టెంట్ గౌతమ్ బ్యూటిఫుల్ జర్నీని హౌస్లో ప్రదర్శించారు. గౌతమ్ ఫ్యాన్స్ ని ఈ వీడియో చాలా బాగా అట్రాక్ట్ చేసింది. కాగా గౌతమ్ టైటిల్ రేసులో ఉన్నాడు. నిఖిల్ తో అతడు పోటీపడుతున్నారు.  

08:18 AM (IST) Dec 12

అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ భద్రత!

అన్నపూర్ణ స్టూడియో వద్ద పోలీసులు 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారట. అలాగే ఎలాంటి అల్లర్లు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారట. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే. అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్ద హంగామా చేసే అవకాశం ఉంది. టైటిల్ విన్నర్ ర్యాలీలు చేయడం, మీడియాతో మాట్లాడటం వంటివి నిషేదించారట. నేరుగా ఇంటికి వెళ్లిపోవాలని ముందుగానే సూచనలు చేయనున్నారట.

07:17 AM (IST) Dec 12

సూట్ కేసు ఆఫర్ కోసం అవినాష్ వెయిటింగ్

ఫైనల్ లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ కి ఒక ఆఫర్ ఇస్తాడు. డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకోవచ్చని టెంప్ట్ చేస్తారు. ప్రేక్షకుల్లో బ్యాడ్ అవుతామని ఈ ఆఫర్ కి కంటెస్టెంట్స్ ఒప్పుకోరు. కానీ టైటిల్ కొడతానని ఏ మాత్రం నమ్మకం లేని అవినాష్ సిద్ధంగా ఉన్నాడట. రూ. 10-15లక్షల ఆఫర్ వస్తే అవినాష్ తీసుకుని, టైటిల్ రేసు నుంచి తప్పుకుంటాడని అంటున్నారు.