ఈ ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేయడంతో పాటు, పుష్ప 2 సక్సెస్ ప్రెస్ మీట్లో సైతం విచారం వ్యక్తం చేశారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు.
అదే విధంగా రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని సైతం ప్రకటించారు. గత 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూస్తున్నానని, ఇలా ఎప్పుడూ జరగలేదని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, అదే విధంగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.