Jan 21, 2022, 3:08 PM IST
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' ప్రస్తుతం అన్ని ఏరియాల్లో పాజిటివ్ రెస్పాన్స్ తో ఇంకా థియేటర్లలో ఆడుతోంది. తండ్రి, కొడుకు తమదైన నటనా శైలితో అభిమానులను, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘సొగ్గాడే చిన్న నాయనా’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం రెండో వారంలోకి ఈ సినిమా కూడా అడుపెట్టి కాసుల వర్షం కురిపిస్తోంది. ఫ్యామిలీ డ్రామా కావడంతో ప్రేక్షకులు ఇంకా సినిమాను థియేటర్లలో వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే సినిమా మంచి హిట్ సాధించిన తర్వాత నాగార్జున ఫ్యామిలీతో కలిసి శ్రీ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీఐపీ దర్శనం చేసుకున్న నాగార్జున మాట్లాడుతూ స్వామి వారి దర్శనం చేసుకుని రెండేండ్లయ్యిందన్నారు. కరోనా కారణంగా రెండేండ్లుగా స్వామి వారిని దర్శించుకోవడం కుదరలేదన్నారు. మళ్లీ ఇప్పుడు వచ్చామని తెలిపారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల ప్రజులు ఆనందంగా, సు:ఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారికి ప్రత్యేక పూజల చేయించినట్టు తెలిపారు.
The Continues its Rule 🤘 Enters Second Week with Solid Hold at all Centers 💥with all your Love ❤️ 🔥 pic.twitter.com/35sTi1re4O
— Annapurna Studios (@AnnapurnaStdios)మరోవైపు బంగర్రాజు మూవీ రెండో వారంలోకి అడుగు పెట్టిన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోత్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టర్ ను రీల్ చేసింది. ఈ పోస్టర్ లో సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలిచిన బంగార్రాజు రెండో వారం కూడా కొనసాగుతోందని తెలిపారు. ఈ ఫొటోకు క‘బంగార్రాజు ఎంటర్ ఇన్ సెకండ్ వీక్’ అని క్యాప్షన్ పెట్టారు.