బాలీవుడ్ విలన్ గా మెగా బ్రదర్ నయా అవతార్, ఏ చిత్రంలో అంటే...

Mar 25, 2021, 6:14 PM IST

హీరో జగపతిబాబు పదేళ్ల క్రితం రూటు మార్చి విలన్ గా మారి...ఫుల్ బిజీ అయ్యారు.  నందమూరి బాలకృష్ణ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రల్ని పోషించారు . ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో ,అరవింత సమేత చిత్రంలోనూ జగపతి సీరియస్ విలనీతో మెప్పించారు. ఇప్పుడు నాగబాబు సైతం అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నారు. రీసెంట్ గా ఆయన కొత్త లుక్,గెటప్ తో ఫొటో షూట్ చేయించుకున్నారు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ లుక్ ఇప్పుడు ఏ సినిమా కోసమో రివీల్ అయ్యింది.