Jun 15, 2020, 2:15 PM IST
మోహన్ బాబుకు సెన్సేషనల్ హిట్ తెచ్చిపెట్టిన సినిమాల్లో పెదరాయుడు ముందు వరసలో ఉంటుంది. ఆ సినిమా రిలీజై నేటికి పాతికేళ్లు పూర్తైన సందర్భంగా ఆ సినిమా టీం తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సినిమాకు తాను పనిచేయడం తన అదృష్టం అని మ్యూజిక్ డైరెక్టర్ కోటి అన్నాడు. ఈ సినిమా మ్యూజికల్ హిట్ అని తనకు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ బాబుకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు.