నేను సినిమా చేస్తుంటే అమ్మకి నమ్మకమే లేదు.. నాన్న పట్టించుకోలేదు: కూతురు కామెంట్స్ కి షాక్ అయిన సుకుమార్ గాంధీ తాత చెట్టు.. సుకృతి వేణి బండ్రెడ్డి, ఆనంద చక్రపాణి, ఇతరులు నటించిన Upcoming 2025 చిత్రం. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ & గోపీ టాకీస్ పతాకాలపై నవీన్ యెర్నేని, రవిశంకర్, శేష సిందూరావు నిర్మించారు. ఈ సినిమా జనవరి 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించగా సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను సినిమా చేస్తుంటే అమ్మకి నమ్మకమే లేదు.. నాన్న పట్టించుకోలేదని ఆమె చెప్పారు. దీంతో సుకుమార్ షాకయ్యాడు. తాను ఎందుకు Suggestions చేయలేదో చెప్పాడు.