మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో లైలా మెగా మాస్ ఈవెంట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా స్టార్ చిరంజీవి హాజరై మాట్లాడారు. ఈ ఈవెంట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వైసీపీ పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.