విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న దర్శకుడు ఆర్జివి, మాజీ మంత్రి కొండా సురేఖ

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న దర్శకుడు ఆర్జివి, మాజీ మంత్రి కొండా సురేఖ

Published : Jun 13, 2022, 05:18 PM IST

విజయవాడ: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కాంగ్రెస్ నాయకులు కొండా సురేఖ, మురళి దంపతుల బయోపిక్ ''కొండా'' పేరుతో రూపొందిన విషయం తెలిసిందే.

విజయవాడ: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కాంగ్రెస్ నాయకులు కొండా సురేఖ, మురళి దంపతుల బయోపిక్ ''కొండా'' పేరుతో రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ చిత్రబృందం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.  మాజీ మంత్రి కొండా సురేఖ, దర్శకుడు రాంగోపాల్ వర్మతో పాటు నిర్మాత కొండా సుష్మిత, నటులు అదిత్ అరుణ్, ఇర్ర మోర్ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు కొండా సినిమా బృందానికి వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.... విజయవాడలోనే ఇంజనీరింగ్ చదివినా ఏనాడు దుర్గమ్మ దర్శించుకోలేదన్నారు. కానీ కొండా సురేఖ దంపతుల వల్ల ఈనాడు అమ్మవారిని దర్శించుకున్నానని అన్నారు.    కొండా సినిమా హిట్ కావాలని అమ్మవారిని కోరుకున్నానని వర్మ తెలిపారు. కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆర్జీవీ దేవుడు పంపిన దూతగా వచ్చి తమ బయోపిక్ తీశారన్నారు.  సినిమా విజయవంతం అయ్యాక అమ్మవారి దర్శనానికి మళ్లీ వస్తామని సురేఖ పేర్కొన్నారు.

మనల్నెవడ్రా ఆపేది.. పవన్ డైలాగుతో దుమ్ము రేపిన నాని | HIT3 | Srinidhi Shetty | Asianet News Telugu
పాక్ కి ఇండియా గట్టిగా ఇచ్చిపడేస్తుంది: పహల్గాం ఘటనపై విశ్వక్సేన్ | Nani | Hit3 | Asianet Telugu
Hit3 చివరి 30 నిమిషాలు మామూలుగా ఉండదు.. నాని ముందే లీకిచ్చిన అడవి శేషు | Asianet News Telugu
షూటింగ్ లో నాని జుట్టు కాలిపోయింది.. అయినా తగ్గలేదు: శైలేష్‌ కొలను | Hit3 | Nani | Asianet Telugu
HIT3 రివ్యూ ముందే చెప్పిన రాజమౌళి | Nani | SS Rajamouli | Srinidhi Shetty | Asianet News Telugu
మహాభారతంలో నాని క్యారెక్టర్ ఫిక్స్.. ఓపెన్ అయిన రాజమౌళి | Hit3 | Nani | Rajamouli | Asianet Telugu
వామ్మో.. KGF హీరోయిన్ ఇంత ఇంటెలిజెంటా! 10thలో 93 పర్సెంట్ | Srinidhi Shetty | HIT3 | Asianet Telugu
Retro: పహల్గాం ఘటనపై విజయ్ దేవరకొండ రియాక్షన్ | Suriya | Pahalgam Attack | Asianet News Telugu
బ్రిటిషోళ్లని, ఔరంగజేబుని కలిసి నాలుగు పీకాలని ఉంది: Vijay Devarakonda, Surya fun | Asianet Telugu
Retro: మేమంతా మీతో ఉన్నాం.. పహల్గాం ఘటనపై సూర్య హార్ట్ టచ్చింగ్ వర్డ్స్ | Pahalgam | Asianet Telugu