తమ్ముళ్లు చిరు, పవన్‌లకు ధన్యవాదాలు : కైకాల సత్యనారాయణ

Jul 26, 2020, 11:21 AM IST

 న‌వ‌ర‌స న‌టసార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ 85వ పుట్టినరోజు శనివారం జరిగింది. ఈ సందర్భంగా  పలువురు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందించిన అభిమానులకు శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స‌త్య‌నారాయ‌ణ. న‌టుడిగా 61 సంవ‌త్స‌రాలు పూర్తయ్యాయని అన్నారు. ముఖ్యంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన తమ్ముడు చిరంజీవి, పవన్ కల్యాణ్ లకు ధన్యవాదాలు అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.