ఇట్లు అమ్మ : ఒక్క తుఫాను రాత్రి అని చెప్పి..పన్నెండు రాత్రులు తీశారు...

Feb 11, 2020, 4:15 PM IST

అంకురం చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయ పురస్కారం అందించిన దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు అమ్మ’. మదర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అనేది ఈ చిత్ర ఉపశీర్షిక. ప్రముఖ నటి రేవతి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సందేశాత్మక చిత్రాన్ని బొమ్మక్ క్రియేషన్స్ పతాకంపై బొమ్మక్ మురళి నిర్మించారు.