Galam Venkata Rao | Published: Mar 15, 2025, 8:01 PM IST
హీరో ఆది సాయికుమార్, హీరోయిన్ అవికా గోర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం షణ్ముఖ. షణ్ముగం సాప్పని దర్శకత్వం వహించిన ఈ సినిమాకు షణ్ముగం, తులసీరాం సాప్పని, రమేష్ యాదవ్ నిర్మాతలు. డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యాంకర్ సుమ.. డైరెక్టర్ షణ్ముగం, హీరో హీరోయిన్లను ఇంటర్వ్యూ చేశారు. షణ్ముఖ మూవీ థ్రిల్లింగ్ విశేషాలను పంచుకున్నారు.