మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో లైలా మెగా మాస్ ఈవెంట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగా స్టార్ చిరంజీవి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ఫిల్మ్ హరిహర వీరమల్లులోని ఓ పాట పాడి అలరించారు పెంచల దాస్.