Sep 14, 2019, 1:58 PM IST
మ్యాచో హీరో గోపీంచ్ హీరోగా ప్రముఖ నిర్మాత శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి పతాకంపై ప్రొడక్షన్ నెం.26గా సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. బిను సుబ్రమణ్యం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను ఇండియా సహా నేపాల్, కాంబోడియా, థాయలాండ్‌లో చిత్రీకరిస్తారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సతీశ్ కురుప్ కెమెరా వర్క్‌ను అందిస్తున్నారు. హీరోయిన్ సహా మిగిలిన నటీనటులను త్వరలోనే తెలియజేస్తామని యూనిట్ తెలియజేసింది.