Dec 28, 2021, 1:44 PM IST
అమరావతి: తమ సమస్యలను ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం సమావేశమయ్యారు. ముఖ్యంగా సినిమా టికెట్ ధరల తగ్గింపు, థియేటర్ల ఇబ్బందులపై మంత్రితో వీరు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి 19 మంది డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఎఫ్డీసీ చైర్మన్ విజయకుమార్ రెడ్డి హాజరయ్యారు.