ప్రియదర్శి, హర్షరోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’. ఈ సినిమాకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా... ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కోర్ట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూవీ టీంతో కలిసి సినిమా ముచ్చట్లు పంచుకున్నారు.