అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మెగా ఫ్యామిలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు కొణిదెల వారి కుటుంబంలోని మహిళలతో చిట్ చాట్ చేశారు. తమ జీవితంలో మహిళల పాత్ర, తమ విజయాల వెనుక ఉన్న వారి స్ఫూర్తి, త్యాగాలు, ప్రేమను పంచుకున్నారు. తన తల్లి అంజనమ్మ నుంచి నేర్చుకున్న దానగుణాన్ని వివరించారు.