Galam Venkata Rao | Published: Mar 20, 2025, 1:01 PM IST
సప్తగిరి హీరోగా, ప్రియాంక శర్మ హీరోయిన్ గా, మురళీధర్ గౌడ్, అన్నపూర్ణమ్మ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని, బాష, లక్ష్మణ్ మీసాల, రోహిణి, రాంప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా 'పెళ్లికాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ SKN మాట్లాడారు. అందరినీ నవ్వించే బ్రహ్మానందం వందల ఏళ్లు బతకాలని ఆకాంక్షించారు.