హాస్య బ్రహ్మ, తెలుగు సినీ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం. ఈ మూవీలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ తో పాటు వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలై.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో బ్రహ్మా ఆనందం మూవీ టీం హార్ట్ వామింగ్ బ్లాక్ బస్టర్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు, కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ.. తన కొడుకు హిట్ కొట్టాడని అందరూ అంటున్నారని చెప్పారు.