బిగ్ బాస్‌లో పెద్ద ట్విస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. డబుల్ ఎలిమినేషన్

Sep 26, 2024, 10:34 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 8లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నిజంగా భూకంపం లాంటి న్యూస్ చెప్పాడు బిగ్ బాస్. కంటెస్టెంట్స్‌కు ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్ చెప్పి షాకిచ్చాడు. ఈ సీజన్ లో 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు ప్రకటించాడు. అంతే కాదు ఇందులో కొన్ని మెలికలు కూడా పెట్టాడు బిగ్ బాస్. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సబంధించిన లిస్ట్ కూడా వైరల్ అవుతోంది. గత సీజన్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్నవారు.. ఈసారి సీజన్ 8 లో.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సిద్ధం అవుతున్నారు.