అవినాష్ ఎంట్రీతో జోరందుకున్న బిగ్ బాస్.. షాక్ లో అఖిల్, అభిజిత్..

Sep 18, 2020, 2:18 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 రెండోవారం చివర్లోకి వచ్చే సరికి ఫుల్ జోష్ అందుకుంది. జబర్దస్త్ ముక్క అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఎపిసోడ్ మొత్తం ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది. అంతకుముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి అనుకున్నంతగా ఎపెక్ట్ చూపించలేకపోయాడు. కానీ అవినాష్ మాత్రం ఎంట్రీతోనే అదరగొట్టేశాడు. గంగవ్వను గుర్తు పట్టావా అని అడిగితే ఆమె గుర్తు పట్టలేదు. జోకర్ మేకప్ లో నన్ను నేనే గుర్తు పట్టుకోలేకపోతున్నా అంటూ కామెడీ చేసి నవ్వించాడు.