వీడియో : బిగ్ బాస్ ఫేం రాహుల్ సిప్లిగంజ్ పై బీర్ బాటిల్స్ తో దాడి

Mar 5, 2020, 10:54 AM IST

బిగ్ బాస్ ఫేం రాహుల్ సిప్లిగంజ్ పై హైదరాబాద్ లోని ఓ పబ్ లో దాడి జరిగింది. బీర్ బాటిళ్లతో తలపై కొట్టడంతో రాహుల్ గాయపడ్డాడు. రాహుల్ తో పాటు వచ్చిన యువతి పట్ల పబ్ లోని కొంతమంది అసభ్యంగా ప్రవర్తించడంతో గొడవ జరిగిందని తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువుల పట్ల రాహుల్ అనుచితంగా ప్రవర్తించడంతో ఈ దాడి జరిగిందని కూడా అంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.