సౌత్ ఇండియాలో హిట్ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచే చలనచిత్ర నిర్మాణ సంస్థల్లో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఒకటి. ఈ సంస్థ వరుసగా చిత్రాలను నిర్మిస్తోంది. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ తో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘లవ్ టుడే’ని నిర్మించింది. మళ్లీ అదే కాంబినేషన్‌లో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ నటించారు. కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఓరి దేవుడా మూవీ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుండగా.. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ నిర్వహించారు. సినీ సరదా విషయాలను పంచుకొని సందడి చేశారు.