Dec 28, 2020, 4:05 PM IST
మొదటి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీని రనౌట్ చేసిన అజింకా రహానేకి, రనౌట్‌ను తిరిగి అప్పగించేశాడు భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. వికెట్ల మధ్యలో సునామీ వేగంతో పరుగెత్తే జడ్డూ, టెస్టు మ్యాచ్‌లో ఓ క్విక్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే లబుషేన్ వేగంగా బంతిని అందుకోవడంతో రహానే వికెట్ కోల్పోయింది భారత జట్టు. తొలి టెస్టులో కెప్టెన్ కోహ్లీ రనౌట్ కాగా, ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్ రనౌట్ రూపంలో అవుట్ అయ్యాడు.