బజ్జీలు, వడలు అమ్ముతున్న మాజీ మంత్రి కొడాలి నాని...

Nov 29, 2022, 9:46 AM IST

గుడివాడ :  మాజీ మంత్రి, ప్రస్తుత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని బజ్జీలు, బోండాలు అమ్మారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు వైసిపి ఎమ్మెల్యేలంతా తమతమ నియోజకవర్గాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుడివాడ పట్టణంలోని 4వ వార్డులో నాని పర్యటించారు. ఈ సందర్భంగా ఓ హోటల్ వద్ద ఆగిన మాజీ మంత్రి స్వయంగా బజ్జీలు, వడలు అమ్మారు. అలాగే బజ్జీలు టేస్ట్ చేసారు.