సోంపేట రైల్వే స్టేషన్‌లో భువనేశ్వర్–తిరుపతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పైకెక్కి యువకుడు కలకలం రేపాడు. హై వోల్టేజ్ లైన్లకు ప్రమాదం ఉండటంతో అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి రైలును ఆపేశారు. దాదాపు 30 నిమిషాల పాటు రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యువకుడు పలుచోట్ల కోచ్‌ల మీదుగా పరుగెత్తగా, చివరకు రైల్వే సిబ్బంది సురక్షితంగా కిందకు దించారు.