Jul 22, 2020, 2:08 PM IST
నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు ఉత్తర్వును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశాలు జారీచేయడాన్ని మండలి ప్రతిపక్ష నేత, టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు స్వాగతించారు. ఆర్టికల్ 243 కె (2) ప్రకారం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్డినెన్స్ జారీ చేశారన్నారు. తాజాగా గవర్నర్ ఆదేశాలు జగన్ ప్రభుత్వానికి, అతని న్యాయ విభాగానికి గట్టి దెబ్బ అన్నారు. దీనికి బాధ్యతగా ప్రభుత్వాన్ని ఎవరు అయితే తప్పుదారి పట్టించారో వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా వంకలు చెప్పకుండా ప్రభుత్వం నిమ్మగడ్డను ఎస్ఈసీగా కంటిన్యూ చేయకపోతే రాజ్యాంగ సంక్షోభంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు.