Mar 21, 2023, 12:53 PM IST
చేసింది. అంగన్వాడీలో పనిచేసే భార్య తోటి వర్కర్స్ తో అసెంబ్లీ ముట్టడికి వెళుతుంటే దింపడానికి వెళ్లాడు వీఆర్వో. ఇదే అతడిని గత 24 గంటలుగా జైల్లో వుండేలా చేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది.
అసెంబ్లీ ముట్టడి కోసం విజయవాడ వెళుతున్న భార్యను గుడివాడ రైల్వేస్టేషన్ లో దింపడానికి వెళ్లాడు దొండపాడు వీఆర్వో కాటూరి అనిల్. అయితే అంగన్వాడీలు విజయవాడ వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న కానిస్టేబుల్ రమాదేవి అనిల్ బార్యను కూడా అడ్డుకుంది. ఈ క్రమంలోనే వీఆర్వో, కానిస్టేబుల్ కు మద్య వివాదం రేగింది. అనిల్ తన చున్నీ లాగడమే కాదు చెయ్యి కొరికి గాయపర్చాడని కానిస్టేబుల్ అంటుంటే... ఆమే తనతో దురుసుగా ప్రవర్తించి దాడికి దిగిందని వీఆర్వో అంటున్నాడు. దీంతో ఇరువురి ఫిర్యాదులతో ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఈ వివాదం పెద్దదయి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గొడవగా మారింది. వీఆర్వో అనిల్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి గత 24 గంటలుగా స్టేషన్ లోనే వుంచారు పోలీసులు. దీంతో రెవెన్యూ ఉద్యోగులు పోలీసు తీరును తప్పుబడుతూ వెంటనే వీఆర్వో ను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో గుడివాడ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.