Jul 21, 2020, 6:11 PM IST
పులసలు సంవత్సరంలో మూడు నెలలు అంటే జూలై , ఆగస్ట్ సెప్టెంబర్ లలో మాత్రమే లభిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ లోగా సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఈ సీజన్ ని గోదావరి జిల్లాల్లో పులస ఫెస్టివల్ గా కూడా పిలుస్తూ వుంటారు. ఈ చేపలు ఆస్ట్రేలియాలో పుట్టి, న్యూజిలాండ్ కి వస్తాయి. అక్కడి నుండి టాంజానీయా ఆ తర్వాత హిందూ మహాసముద్రం గుండా బంగాళాఖాతం లోకి వస్తాయి. ఇక వర్షాకాలంలో భారీ వర్షాలకు గోదావరిలోకి నీరు చేరడం మొదలవుతుందో అప్పుడు ఈ పులసల హడావుడి మొదలవుతుంది