రోజూ ఒక స్పూన్ పరగడుపన నెయ్యి తింటే జరిగేది ఇదే..!

First Published Apr 24, 2024, 10:02 AM IST

మందికి కడుపులో మంట, గ్యాస్ తదితర సమస్యలు ఉంటాయి. వాటన్నింటనీ.. ఒక్క స్పూన్ నెయ్యి చిటికెలో తగ్గించేస్తుంది. అంతేకాకుండా.. నెయ్యిలో ఉండే న్యూట్రియంట్స్ కూడా బాడీకి అందుతాయి.

ghee

నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. దాదాపు మనం నెయ్యి ని ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగం చేసుకొని తింటూ ఉంటాం. అయితే.. ఇదే నెయ్యిని ప్రతిరోజూ ఒక స్పూన్ కనుక పరగడుపున తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం..

రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం కంటే ముందే.. ఒక స్పూన్ నెయ్యి తింటే.. మీ జీర్ణ సమస్యలన్నీ మటుమాయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి కడుపులో మంట, గ్యాస్ తదితర సమస్యలు ఉంటాయి. వాటన్నింటనీ.. ఒక్క స్పూన్ నెయ్యి చిటికెలో తగ్గించేస్తుంది. అంతేకాకుండా.. నెయ్యిలో ఉండే న్యూట్రియంట్స్ కూడా బాడీకి అందుతాయి.
 

నెయ్యిలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి.. మన మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడానికి సహాయపడతాయి. దాని వల్ల మన జీర్ణ వ్యవస్థ మొత్తం సక్రమంగా పని చేస్తుంది. మన శరీరానికి కావాల్సిన తక్షణ ఎనర్జీని కూడా అందిస్తుంది.

చాలా మంది నెయ్యి తింటే బరువు పెరుగుతారు అనుకుంటారు. అది కూడా పరగడుపున నెయ్యి తింటే ఇంకేమైనా ఉందా అని భయపడతారు. కానీ.. పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తింటే.. మీ బరువు పెరిగే సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇది.. మీ బరువును మేనేజ్ చేస్తుంది. అధిక బరువు పెరగకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన ఫ్యాట్స్.. మన కర్బ్ క్రేవింగ్స్ ని సంతృప్తి పరుస్తాయి. దీని వల్ల.. ఆ రోజంతా వేరే ఫుడ్స్ ఓవర్ గా తినాలనే కోరిక కలగదు. ఫలితంగా అధిక బరువును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.
 

ghee

కీళ్ల నొప్పులు , నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో నెయ్యి సహాయపడుతుందని నమ్ముతారు. నెయ్యిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కణజాలం , కీళ్లపై కందెనగా పనిచేస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుంది.నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లు, ఖనిజాలు , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన ఎంపిక , రోగనిరోధక శక్తిని పెంచడానికి రెగ్యులర్ వినియోగం కోసం మంచిది.

ghee

నెయ్యిలో ఉండే ఫ్యాట్స్.. మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నెయ్యి అందించే న్యూట్రియంట్స్ కారణంగా.. బ్రెయిన్ సెల్స్ చాలా యాక్టివ్ గా పని చేస్తాయి. మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునేవారు పరగడుపున నెయ్యి తినడం అలవాటు చేసుకోవాలి.

Ayodhya Ram Mandir


అంతేకాదు.. పరగడుపున నెయ్యి తినడం వల్ల.. మన బాడీలో నుంచి  టాక్సిన్స్ ని బయటకు పంపేయవచ్చు.  ఓవరాల్ గా మొత్తం ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. 


ఈ మధ్యకాలంలో చాలా మంది హార్మోనల్ బ్యాలెన్స్ తో బాధపడుతూ ఉంటారు. అలాంటివాళ్లు.. ఈ నెయ్యిని తీసుకోవడం మొదలుపెట్టాలి. చాలా వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు, దాని తాలుకా వచ్చే సమస్యలు కూడా తగ్గిపోతాయి.

click me!