రంగస్థలం చిత్రంలో పూజిత ఆది పినిశెట్టి ప్రేయసి పాత్రలో నటించింది. పెద్దగా ప్రాధాన్యత లేని పాత్ర అయినప్పటికీ కథలో కీలక మలుపుకి కారణం ఆ పాత్రే. కొన్ని నిమిషాల పాటు రంగస్థలం చిత్రంలో పూజిత కనిపించింది. అయితే పూజితకి తాను కోరుకున్న గ్లామర్ ఇమేజ్ దక్కడం లేదు. గ్లామర్ హీరోయిన్ గా రాణించాలని పూజిత ప్రయత్నిస్తోంది.